English   

మంచి సినిమాలకు కాలం చెల్లిపోయిందా..

cinema
2020-01-19 11:04:54

ఏమో ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మరి. మంచి సినిమాలు చేస్తే ఒకప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరించేవారు. కానీ ఇప్పుడు బాగా తిప్పి కొడుతున్నారు. మంచి ఎక్కువగా చెబితే అసలు పట్టించుకోవడం లేదు. కనీసం దాన్ని ఒక రోజు కూడా థియేటర్లలో ఉంచకుండా తీసి అవతల పారేస్తున్నారు. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎంత మంచివాడవురా. టైటిల్లోనే మంచితనం పెట్టుకొని వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు దారుణంగా తిప్పికొట్టారు. సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ చిత్రం అసలు ఆకట్టుకోలేదు. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆకట్టుకోలేక చేతులెత్తేసింది. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.. కానీ ఆయన ఆశలను అడియాశలు చేస్తూ ఎంత మంచి వాడవురా డిజాస్టర్ అయిపోయింది. గతంలో కూడా మంచి సినిమాలకు ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలు మంచి ఎక్కువైపోయి సినిమా కనీసం ఒక్క రోజు కూడా ఆడలేదు. వీటితోపాటు మరికొన్ని కుటుంబ కథా చిత్రాలకు కూడా ఇలాంటి దారుణమైన ఫలితాలు ఎదురయ్యాయి. అయినా కూడా దర్శకులు ఇప్పటికీ మంచి మంచి అంటూ మంచి సినిమాలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. మరి అలాంటి కథలకు కాలం చెల్లిపోయింది లేని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారో చూడాలి.

More Related Stories