English   

రష్మిక మందన్న స్టార్ హీరోయిన్ అయిపోయినట్లేనా..

rashmika
2020-01-19 11:30:34

ఒకసారి స్టార్ హీరోతో నటిస్తే చాలు.. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోయిన్ మాత్రం క్రేజ్ తెచ్చుకుంటుంది. ఇప్పుడు రష్మిక మందన విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే ఈమె స్టార్ హీరోలతో నటించడం మొదలు పెట్టింది. కెరీర్లో తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించింది రష్మిక. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఈమె క్యూట్ స్వీట్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాస్త ఓవర్ యాక్షన్ అయింది అంటూ ఓ వర్గం ఈమెను విమర్శించిన కూడా క్యారెక్టర్ కి తగ్గట్లు నటించింది కదా అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అప్పట్లో దూకుడు సినిమా తర్వాత సమంత ఒక్కసారిగా నెంబర్వన్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు రష్మిక మందన విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఆశిస్తున్నారు ఆమె అభిమానులు. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో కూడా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఎంపికైంది.

ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. కన్నడలో కూడా బిజీగా ఉంది రష్మిక మందన్న. ఇవన్నీ చూస్తుంటే ఈమె ఒక స్టార్ హీరోయిన్ అయిపోయినట్లే అని అర్థమైపోతుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రష్మిక ఇంకా వెనకాలే ఉంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో నటించిన కూడా ఈమెకు కేవలం 45 లక్షలు మాత్రమే ఇచ్చారు అని ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో నటించిన విజయశాంతికి ఏకంగా కోటిన్నర పారితోషికం ఇచ్చారు. ఈ లెక్క మరో రెండు విజయాలు అందుకుంటే తప్ప రష్మిక మందన కోరుకున్న స్టార్ డమ్ రాదు

More Related Stories