English   

చర్చనీయాంశంగా మారిన సమంతా...చైతూ వద్దు, శర్వా ముద్దు

Naga Chaitanya Sharwanand.jpg
2020-01-19 13:04:24

తెలుగులోనే కాక దక్షిణాది బాషలన్నిటిలో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరిగా దూసుకుపోతోంది సమంత. అక్కినేని వారి కోడలు అయ్యాక కాస్త గ్లామరస్ పాత్రలు ఆపేసిన ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీలపై దృష్టి పెట్టి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తోంది. తాజాగా ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి తమిళ ‘96’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ఆమె ఒక వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే  ఆమె కన్ఫాం చేయలేదు కానీ ఈ ప్రచారం మాత్రం ఎక్కడా ఆగలేదు. అయితే ఇప్పుడు సమంతకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఇందులో నిజం ఎంత ఉందో కానీ కొంచెం కాంట్రావర్సీ రేపేట్టుగానే ఉంది ఈ వార్త. అది ఆర్ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి చేయబోయే మహాసముద్రం సినిమాకు సంబంధించిన వార్త. అదేంటంటే అజయ్ భూపతి ముందుగా తన కథను సమంత కు వినిపించగా ఈ కథకు సమంతా చేయలేనని చెప్పిందట. ఆ తర్వాత ఆ కథను నాగచైతన్యకు వినిపించగా నాగచైతన్య కూడా నో చెప్పినట్లు సమాచారం.

అయితే ఇదే కథను హీరో శర్వానంద్ ఓకే చేశాడని తెలిసి సమంతా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది వేచి చూడాల్సి ఉంది.

More Related Stories