English   

ప్రభాస్ జాన్ అప్డేట్ ఇచ్చిన కృష్ణం రాజు

Prabhas Jaanu.jpg
2020-01-19 14:10:46

ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత ప్యాన్ ఇండియా సినిమాలపైనే దృష్టి పెట్టాడు. బాహుబలి విజయం తర్వాత సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేశారు. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో ఫలితం భారీగానే దెబ్బేసింది. కాగా ఆ తర్వాత రాధా కృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా చేస్తున్నారు. సాహో ఎఫెక్ట్ జాన్ మీద పడి ప్రభాస్ అండ్ టీమ్ జాగ్రత్త పడ్డారు. దాదాపు సాహోకు పని చేసిన టీమ్ జాన్ కు మళ్ళీ పని చేస్తుండడంతో జాన్ సినిమా స్క్రిప్ట్ మొత్తం రీ వెరిఫికేషన్ చేసారు. స్క్రిప్ట్ ను మళ్ళీ రీరైట్ చేయడంతో పాటు బడ్జెట్ ను కూడా 40 శాతానికి పైగా కుదించారు. ముందు మొత్తం విదేశాల్లో షూటింగ్ చేద్దామనుకున్నా అదంతా ఇప్పుడు హైదరాబాద్ లోనే వివిధ స్టూడియోల్లో, ప్రైవేట్ స్థలాల్లో సెట్స్ వేసి వాటిని షూట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్నపూర్ణలో సెట్ కంప్లీట్ కావడంతో ఇక్కడ రెండో షెడ్యూల్ మొదలుపెట్టారు కూడా. గోపీ కృష్ణా మూవీస్ తో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి ప్రభాస్ పెదనాన్న తాజా అప్డేట్ ఇచ్చారు. ఈనెల 20న తేదీ ఆయన 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌ ఎఫ్ఎన్సీసీలో పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సతీసమేతంగా  కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. తమ బ్యానర్ నుండి రాబోతున్న ప్రభాస్‌ జాన్ సినిమా మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుందని, ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తామని ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. తాను కూడా ప్రభాస్ సినిమాలో ఓ కీలక పాత్రనుl పోషిస్తున్నానని ఆయన అన్నారు.

More Related Stories