స్టార్ హీరో సినిమా నుండి తప్పుకున్న కీర్తి...ప్రియమణి ఎంట్రీ

మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకొని ఒక్కసారిగా సినీ ప్రేమికుల దృష్టిని తన వైపు తిప్పుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం దక్షిణాదిన వరుస సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ మైదాన్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన ఒకప్పటి ఫేమస్ పుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. అజయ్‌దేవ్‌గణ్ కథానాయకుడిగా నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో కీర్తి సురేష్ ను ఎంపిక చేశారు దర్శకుడు అమిత్‌శర్మ. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి కీర్తి సురేష్ తప్పుకుందట. కథ ప్రకారం కీర్తి మధ్య వయస్కురాలైన మహిళ పాత్రను పోషించాల్సి వచ్చింది, ఒక రోజు షూట్ లో కూడా పాల్గొన్నాక ఆమె ఈ పాత్రకు సరిపోలేదట. వేరే సినిమాకోసం ఆమె భారీగా బరువు తగ్గడంతో ఆమెను తప్పించారట. ఆమె ప్లేస్‌లో ప్రియమణిని రోప్ చేసిందట సినిమా యూనిట్. ఇక మరో పక్క కీర్తి సురేష్ రజినీకాంత్ కొత్త సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.