English   

రజనీకాంత్‌పై కేసు..అసలేమైందంటే

rajni
2020-01-19 15:38:28

సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై కేసు నమోదైనట్టు సమాచారం. ద్రావిడ పితామహుడు పెరియార్‌ను కించపరిచేవిధంగా వ్యాఖ్యానించారని రజనీకాంత్‌పై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14వ తేదీన నగరంలో జరిగిన ‘తుగ్లక్‌’ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న రజనీకాంత్‌ అక్కడ సభకు హాజరయిన వారిని ఉద్దేశించి మాట్లాడారు. 1971లో సేలంలో పెరియార్‌ నిర్వహించిన ర్యాలీలో సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని విమర్శించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, పెరియార్‌ ర్యాలీ గురించి అబద్దాలు చెబుతూ ఆయన గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన రజనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పెరియార్‌ అభిమానులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ద్రావిడర్‌ విడుదలై కళగం అధ్యక్షుడు కొళత్తూర్‌ మణి నేతృత్వంలో తాజాగా కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రజనీకాంత్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే రాజకీయ అరంగేట్రం కన్‌ఫార్మ్‌ చేసిన నాటి నుండి రజనీ తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.

More Related Stories