English   

అమ్మో ఇలియానాకు కోపం బాగా వచ్చేసిందిగా..

ill
2020-01-19 15:49:14

ఏమైందో ఏమో గానీ చిన్న‌పిల్ల‌లు స‌డ‌న్ గా స్కూల్ కు వెళ్ల‌డం మానేసిన‌ట్లు.. ఇలియానా కూడా ఈ మ‌ధ్య బ‌ట్ట‌లేసుకోవ‌డం మానేసింది. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. ఈ మ‌ధ్య పూర్తి క్యాస్ట్యూమ్స్ కంటే కూడా కేవ‌లం బికినీ ఉంటే చాలు అనుకుంటుంది ఇల్లీబేబీ. హాయిగా గోవా బీచ్ తో పాటు ఇంకా ఇత‌ర దేశాలు తిరిగేస్తూ సంద‌డి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ హొయ‌లు చూసి బాపురే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. ఇదంతా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తాను సిద్ధంగా ఉన్నాను.. ఇంకా అందాల‌న్నీ అలాగే ఉన్నాయంటూ సిగ్న‌ల్స్ పంపించిన‌ట్లుగానే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం సింగిల్ గానే ఉంటుంది గోవా బ్యూటీ. బాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు రావ‌ట్లేదు. విజ‌యాలున్నా ప‌ట్టించుకునేవాడు లేడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మెల్ల‌గా చూపు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లించింది. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో నటించినా ఫలితం రాలేదు. ఇక ఇప్పుడు స‌డ‌న్ గా బికినీ ఫోటోల‌న్నీ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఇదంతా ఆమె ప్రీ ప్లాన్ గా క‌నిపిస్తుంది. ముందు నా ఫోటోలు చూడండి.. న‌న్ను గుర్తు పెట్టుకోండి.. అప్పుడు నేనొస్తా అన్న‌ట్లుంది ఇలియానా వాల‌కం. అయితే కొన్నిసార్లు అది మిస్ ఫైర్ కూడా అవుతుంది. ఇలియానా పోస్ట్ చేస్తున్న ఫోటోలకు నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నపుడు తట్టుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ. పనిచేయడం చేతకాని వాడు కూడా నా ఫోటోలు చూసి కామెంట్ పెడుతున్నాడు.. నాకు ఉచిత సలహాలు ఇస్తున్నాడు అంటూ ఫైర్ అయిపోతుంది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. నా బిల్స్ కడుతూ.. నాకు చికెన్ నగ్గీస్ తినిపిస్తూ ఉండకపోతే నేనేం చెయ్యాలో సలహాలు ఇవ్వకండంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి సినిమాలు లేకపోయేసరికి అందాలను సానపెడుతుంది ఇల్లీబ్యూటీ. మధ్యలో ఇలా సలహాలు ఇస్తే మాటలతో తాట తీస్తుంది ఈ ముద్దుగుమ్మ.

More Related Stories