కేరళలో అడవుల్లో విరాటపర్వం

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య మరో ప్రచారం కూడా ఊపందుకుంది. అదేంటంటే ఈ సినిమాలో రానా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. నక్సల్ పోరాట నేపథ్యంలో వస్తున్న చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను కేరళలోని అటవీ ప్రాంతంలో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక ఈ సినిమాకి వన్ నేనొక్కడినే, సాహో, ఉరిలాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని షాంచెజ్ లోఫెజ్ ఈ చిత్రానికి కూడా అతనే కెమెరామేన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.