English   

రాజ్ తరుణ్ ఇంకా గుర్తున్నాడా.. ఒరేయ్ బుజ్జిగా అంటూ..

raj
2020-01-19 18:27:32

ఉదయ్ కిరణ్ మాదిరే హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి వచ్చాడు రాజ్ తరుణ్. నాగార్జున నిర్మించిన ఉయ్యాలా జంపాలా సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్.. సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రమే ఆయనకు అనుకున్న విజయాలు రాలేదు. వరుసగా పరాజయాలు రావడంతో ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు ఈ కుర్రహీరో. గత కొన్నేళ్లుగా వరస ఫ్లాపులు ఇస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు మరో డిజాస్టర్ ఇచ్చాడు. కెరీర్ పూర్తిగా ముగింపు దశలో ఉన్నప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమా అవకాశం వచ్చింది. ఈ సినిమా రావడంతో కనీసం రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టి తనను తాను నిరూపించుకుంతాడని ఆశించారు అభిమానులు. జి ఆర్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అత్యంత దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. రాజ్ తరుణ్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత నెగిటివ్ టాక్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమా తర్వాత అసలు మనోడు కనిపించడమే మానేసాడు. అయితే ఇలాంటి సమయంలో కూడా మరో సినిమా అవకాశం అందుకున్నాడు రాజ్ తరుణ్. అప్పుడెప్పుడో నాగచైతన్య హీరోగా ఒక లైలా కోసం సినిమా చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఒప్పుడు ఒరేయ్ బుజ్జిగా అంటూ వస్తున్నాడు రాజ్ తరుణ్. మాళవిక నాయర్‌ ఇందులో హీరోయిన్. కెకె.రాధామోహన్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. ఏప్రిల్‌ తొలివారంలో సమ్మర్ కానుకగా విడుదల కానుంది. హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, అన్నపూర్ణ, సోనియా చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కనీసం ఈ చిత్రంతో అయినా రాజ్ తరుణ్ జాతకం మారుతుందా లేదా అనేది చూడాలి.

More Related Stories