English   

ఇడియట్స్.. అంటూ మండిపడ్డ హీరో

sj
2020-01-19 19:05:42

కోలీవుడ్ తో పాటు టాలివుడ్ లోనూ తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్.జె. సూర్య. తెలుగులో పవన్ కళ్యాణ్ తో ఖుషీ, కొమరం పులి.. మహేష్ బాబుతో నాని, అజిత్ తో వాలి వంటి చిత్రాలు తెరకెక్కించాడు సూర్య. అలాగే హీరోగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు 'స్పైడర్' మూవీలో విలన్ గానూ ఇరగదీశాడు. దర్శకుడిగా,నటుడిగా తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాడు. అయితే తాజాగా ఎస్.జె.సూర్య గురించి ఒక రూమర్ వినిపిస్తోంది.

గత కొద్ది రోజులుగా హీరోయిన్ ప్రియాభవాని శంకర్ తో సూర్య ప్రేమలో ఉన్నట్టు కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. వీళ్లిద్దరు 'మాన్స్టర్' అనే చిత్రంలో కలిసి నటించారు. అప్పటి నుంచి సూర్య ప్రియపై మనసు పారేసుకున్నాడని.. తనకు లవ్ ప్రపోజ్ చేశాడని.. ఆ ప్రపోజల్‌ను ప్రియ భవాని శంకర్ రిజెక్ట్ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. దాంతో చిర్రెత్తిన ఎస్.జె. సూర్య తనే స్వయంగా రంగంలోకి దిగాడు. ఈ రూమర్స్‌ పుట్టించిన వారిపై తనదైన శైలిలో మండిపడ్డాడు.

కొంద‌రు ఇడియట్స్ పనిగ‌ట్టుకుని మరీ త‌న‌పై అస‌త్య ప్రచారం చేస్తున్నారని.. తాను ప్రియాభ‌వానీ శంక‌ర్‌కు ప్రపోజ్ చేసినట్టు.. ఆమె రిజక్ట్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అలాంటి వార్తల్లో నిజం లేదని.. 'మాన్స్టర్' మూవీ నుంచి తను నాకు మంచి ఫ్రెండ్ అని.. ప్లీజ్ దయచేసి ఇలాంటి పుకార్లు ప్రచారం చేయొద్దని, ఇరిటేట్ చేయొద్దని.. తన పై వస్తున్న రూమర్స్ పై సోషల్ మీడియాలో చెక్ పెట్టాడు. అయినా నిప్పు లేనిదే పొగపుట్టదని చెవులు కొరుక్కుంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇకపోతే.. ప్రియాభవాని శంకర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌ రూపొందిస్తున్న 'ఇండియన్‌-2' తో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. అలాగే మరోసారి ఎస్‌.జే.సూర్యతో కలిసి 'బొమ్మై' అనే చిత్రంలో నటిస్తుండడం విశేషం.

More Related Stories