English   

రామ్ చరణ్ కు రంగమ్మత్త.. మరి అల్లు అర్జున్ కు ఏంటి..

ana
2020-01-19 19:26:25

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో చేరిపోయింది. అయితే 'రంగస్థలం' లో రామ్ చరణ్ కు రంగమ్మత్తగా చూపించిన సుకుమార్.. ఈ సారి అనసూయను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి ఏర్పడింది. ఈ సారి సుకుమార్ పవర్ ఫుల్ రోల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో సుకుమార్ అనసూయ కోసం ఓ లేడీ విలన్ పాత్రను క్రియేట్ చేసినట్టు వినిపిస్తోంది. నెగిటివ్ యాంగిల్స్ ఉన్న పాత్ర కావడంతో.. అనసూయ బందిపోటు రాణిగా కనిపించనుందట. రంగమ్మత్త పాత్ర కంటే ఇది చాలా పవర్ ఫుల్ గా ఉండేలా సుకుమార్ డిజైన్ చేశాడట. ఇటీవలే సుకుమార్, అనసూయకు తన రోల్ గురించి  చెప్పగా చాలా ఎగ్జైట్ అయి వెంటనే ఓకే చెప్పిందట. రంగమ్మత్తలాగే ఈ పాత్ర కూడా తన కెరీర్లో ది బెస్ట్ గా నిలిచిపోనుందని భావిస్తోందట అనసూయ.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో.. ఈ చిత్రంలో బన్నీ క్యారెక్టర్ తో సహా చాలా క్యారెక్టర్లు మాస్ గానే కనిపించనున్నాయని సమాచారం. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తుండగా.. తమిళ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీకి 'శేషాచలం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి.. అనసూయ బందిపోటు రాణిగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

 

More Related Stories