అనుష్క ఎందుకు తగ్గింది..

అనుష్క 'బాహుబలి' లాంటి వండర్ ఫిల్మ్ తర్వాత నటించింది ఒక్క 'భాగమతి' సినిమా మాత్రమే. రీసెంట్ గా 'సైరా నరసింహారెడ్డి'లో మెరిసిన స్వీటికి.. ప్రస్తుతం 'నిశ్వబ్దం' తప్ప మరే సినిమాలు లేవనే చెప్పాలి. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన వెంకట్ 'నిశ్శబ్దం' చిత్రాన్ని నిర్మించారు. ఇందులోమాధవన్, అంజలి, శాలిని పాండే, కీలక పాత్రల్లోనటిస్తున్నారు. అలాగే హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సెన్ విలన్ గా కనిపించనున్నాడు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉన్న'నిశ్శబ్దం' మూవీని.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా జనవరి 31న ఈ సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా విడుదల వాయిదా పడ్డట్టు సమాచారం. అందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ కాకపోవడం వల్లే పోస్ట్ పోన్ అయినట్టు టాక్. అసలు వివరాల్లోకి వెళితే..
ఈ సినిమా షూటింగ్ అంతా అమెరికాలో జరపడంతో బడ్జెట్ కాస్తా ఎక్కువే అయిందట. దాంతో రిలీజ్ కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆశించినంతగా బిజినెస్ జరగడం లేదట. ముఖ్యంగా అనుష్క ఇమేజ్ దృష్ట్యా తమిళ, హిందీ వెర్షన్లకు మంచి బిజినెస్ జరుగుతుందని భావించారట. కానీ అందుకు భిన్నంగా.. ఎక్కువ రేట్ పెట్టేందుకు బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదని వినిపిస్తోంది. దాంతో ఈ సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేశారు. మరి.. ఇప్పుడైనా అనుకున్న టైంకు నిశ్వబ్దం రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.