English   

ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పదా..

prabhas
2020-01-20 05:11:13

కెరీర్ బిగినింగ్ నుంచి సంత్సరానికి ఒకటి.. కుదిరితే రెండు సినిమాలు చేశాడు ప్రభాస్. ఇలా 2002లో 'ఈశ్వర్' మొదలుకొని 2013లో వచ్చిన 'మిర్చి' వరకు సంవత్సరానికి కనీసం ఒక్కటి లేదా రెండు సినిమాలతో అలరించాడు రెబల్ స్టార్. అయితే 'మిర్చి' తర్వాత తన రూటు మారిందనే చెప్పాలి. రెండేళ్ల గ్యాప్ ఇచ్చి 2015 లో 'బాహుబలి'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత మళ్లీ రెండేళ్లకు 2017 లో 'బాహుబలి పార్ట్-2' తో అలరించాడు.

'బాహుబలి' తర్వాత మళ్లీ రెండేళ్లకు 2019లో 'సాహో' అంటూ మన ముందుకొచ్చాడు. ఇలా రెండేళ్ల గ్యాప్ తో సినిమాలు చేస్తు వస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్. అయితే.. అప్ కమింగ్ మూవీ 'జాన్' తోనైనా సంవత్సరం గ్యాప్ తో సినిమా వస్తుందనుకుంటే.. అది సాధ్యం కాదని తేలిపోయింది. రీసెంట్ గానే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న'జాన్' మూవీ.. ఈ ఏడాదిలో రిలీజ్ పక్కా అనుకున్నారు. కానీ 2020లో ప్రభాస్ నుంచి సినిమా రావడం లేదు.

ఈ ఏడాదిలో ప్రభాస్ ఉండదని అతడి పెదనాన్న కృష్ణంరాజు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది అంటే 2021 సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు కృష్ణంరాజు ప్రకటించారు. ఇప్పటికే యూరోప్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకొని.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత విదేశాల్లో షూట్ జరుపుకొని.. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే సంవత్సరం వేసవిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. దాంతో ప్రభాస్ అభిమానులు మళ్లీ నిరీక్షణ తప్పదా..? అంటూ నిరాశ పడుతున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా రాదనే విషయం తేలిపోయింది.

 

More Related Stories