పవన్ కళ్యాణ్ కు ఎన్.ఎస్.జీ భద్రత..పొత్తు ఎఫెక్జ్ట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. 2014లో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చిన ఆయన గత ఎన్నికల్లో మాత్రం సొంతంగా పోటీ చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఏమనుకున్నారో ఏమి చర్చలు జరిపారో ఏమో కానీ ఆయన మళ్ళీ బీజేపీతో చేతులు కలిపి ముందుకు వెళ్తున్నాడు.
రాజకీయాల్లో ఎవరూ కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు కూడా ఉండరని పవన్ తేల్చేశారు. ప్రజలకు మంచి చేసే సమయంలో మిత్రులు శత్రువులుగా మారొచ్చు, శత్రువులు మిత్రులుగా మారొచ్చు. అయితే ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో కేంద్ర హోం శాఖ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయనకీ రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేస్తుంది.
అయితే, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. 8+8 ఎన్.ఎస్.జీ కమాండో భద్రతను కల్పిస్తూ నిన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.