English   

రాశి ఖన్నా దూకుడు.. విజయాలతో పాటే గ్లామర్ షో కూడా..

Raashi Khanna
2020-01-20 17:26:43

రాశీఖ‌న్నా.. ఈ పేరుతో ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది.. ఇక్క‌డ విజ‌యాలు కూడా అందుకుంది. కొన్నేళ్ల పాటు మధ్యలో విజయాలు లేకపోయినా కూడా ఇప్పుడు మాత్రం వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలతో విజయాలు అందుకుంది. దాంతో ఇక్కడ మళ్లీ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ‌నివాస క‌ళ్యాణం ఫ్లాప్ త‌ర్వాత అమ్మ‌డు తెలుగులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. కానీ ఇప్పుడు విజయాలు కూడా రావడంతో మళ్లీ దూకుడు పెంచే పనిలో ఉంది రాశి. అందుకే అందాల ఆరబోత కూడా బాగానే చేస్తుంది.

ప్ర‌స్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో బిజీగా ఉంది. త‌మిళ ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖ‌న్నా. రెండేళ్ల కింది వ‌ర‌కు తెలుగు త‌ప్ప మ‌రో భాష‌లో సినిమాలే చేయ‌ని రాశీఖ‌న్నా.. ఇప్పుడు త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. విల‌న్ సినిమాతో కేర‌ళ‌కు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్క‌డ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. 

స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తారేమో అనుకుంటే అస్సలు వర్కవుట్ కావడం లేదు. అందుకే చిన్న హీరోలు.. వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ ఖన్నా. అయితే ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ అని గిరి గీసుకుని కూర్చున్న రాశీఖ‌న్నా.. ఇప్పుడు మాత్రం తెగిన గాలిప‌టంలా అన్ని ఇండ‌స్ట్రీలు చుట్టేస్తుంది.

More Related Stories