English   

లీకైన లవ్ స్టోరీ క్లైమాక్స్.. కంటతడి పెట్టడం ఖాయం

nag
2020-01-20 19:44:33

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ లీకైందని.. ఇదే ఆ క్లైమాక్స్ అంటున్నారు.

'లవ్ స్టోరీ' క్లైమాక్స్ విషాదాంతం అంటున్నారు. ఇందులో హీరో పాత్ర చనిపోతుందని.. అతని జ్ఞాపకాలతో సాయి పల్లవి లైఫ్ ఉంటుందట. చాలా భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులను కంటతడి పెట్టేలా.. చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నట్టు సమాచారం. ఇలా బాధాకరమైన క్లైమాక్స్ ఉండబోతుందని సినీ వర్గాల భోగట్టా. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి పల్లెటూరి నేపథ్యం ఉన్నవాళ్లని చెప్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగచైతన్య తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. మజిలీ, వెంకిమామ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. దాంతో 'లవ్ స్టోరీ' పై భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే ఫిదా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో సినిమా పై అంచానలు పెరిగాయి. మరి లీక్ అయిన 'లవ్ స్టోరీ' క్లైమాక్స్ లో ఎంతవరకు నిజముందో.. తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories