English   

వేశ్య నుంచి రంగస్థల నటిగా.. ఐశ్వర్యరాయ్

aish
2020-01-21 04:56:40

ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖుల బయోపిక్ లు సినిమాగా రూపొందాయి. కొందరి బయోపిక్ లు సినిమాటిక్ గా ఉండడంతో.. వాటికి కమర్షియల్ హంగులు జోడించి తెరపై తీసుకొస్తున్నారు. తాజాగా అలాంటి ఒక బయోపిక్ కు రంగం సిద్దం అవుతోంది. అయితే.. ఇప్పుడు తెరకెక్కబోయే జీవిత చరిత్ర చాలా ప్రాముఖ్యతను సంతరిచంచుకోనుంది. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా ఎదిగిన బినోదిని దాసి లైఫ్ ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ సర్కార్ బినోదిని దాసి బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ముందుగా ఈ కథను దీపిక పదుకొనేతో చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ తాజాగా దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. అందుకు కారణం.. దీపిక ఇలాంటి సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఎంటర్టైనర్ జానర్ లో సినిమాల్లో నటించాలనుకుంటోందట. అందుకే నో చెప్పినట్టు సమాచారం. దాంతో ఈ స్టోరీ ఐశ్వర్య రాయ్ దగ్గరికి వెళ్లిందట. కథ విన్న ఐష్ వెంటనే ఓకే చెప్పిందట. దాంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు.

ఇకపోతే బినోదిని దాసి గురించి చెప్పాలంటే.. ఈమె 19వ శ‌తాబ్దంలో బెంగాలీ న‌ట‌క రంగంపై చెరగని ముద్ర వేసింది. దాదాపుగా 80కి పైగా నాటకాల్లో వివిధ పాత్రలు పోషించారు. ఈమె ఆత్మకథ 'అమ‌ర్ క‌థ‌' ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందట. బినోదిని తన 12వ ఏటా 1874లో మొదటిసారి రంగస్థలం పై అడుగుపెట్టి.. అంచలంచలుగా ఎదిగింది. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నాయి. ఈ కథకు ఐశ్వర్యరాయ్ పచ్చజెండా ఊపడంతో.. వెంటనే ప్రదీప్ సర్కార్ పూర్తి స్థాయి స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నాడట. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

 

More Related Stories