English   

ఎప్పుడూ వాళ్లతోనే సినిమాలు చేస్తావా మహేష్..

Mahesh Babu
2020-01-21 10:03:10

ఇండస్ట్రీలో రిపీట్ కాంబినేషన్స్ నమ్మడంలో ముందుండే హీరో మహేష్ బాబు. తనకు ఒక్క హిట్ ఇస్తే చాలు.. మరో సినిమాకు పర్మిషన్ ఇచ్చేస్తుంటాడు ఈయన. ఇండస్ట్రీలో మిగిలిన హీరోలతో ఒక్క సినిమా కూడా చేయని దర్శకులతో కూడా ఒకటికి రెండుసార్లు పనిచేసాడు సూపర్ స్టార్. అరే.. తనకు ఒక్కడు లాంటి సినిమా ఇచ్చాడని గుణశేఖర్ తో మూడు సినిమాలు చేసాడు ఈయన. ఒక్కడు, అర్జున్, సైనికుడు సినిమాలకు కలిసి పనిచేసారు ఈ జోడీ. 

అతడు ఇచ్చాడని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఖలేజా సినిమా చేసాడు. ఇక దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా గిఫ్టుగా ఇచ్చాడని.. ఆగడుతో మరోసారి శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చాడు. పూరీ జగన్నాథ్ తో కూడా పోకిరి, బిజినెస్ మ్యాన్ సినిమాలు చేసాడు ఈయన. ఇక శ్రీమంతుడు సినిమా ఇచ్చాడని కొరటాలకు వెంటనే భరత్ అనే నేను సినిమా ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో లాంటి మంచి సినిమా ఇచ్చాడనే కృతజ్ఞతతోనే సరిగ్గా కథ కూడా వినకుండా శ్రీకాంత్ అడ్డాలపై ఉన్న నమ్మకంతో బ్రహ్మోత్సవం లాంటి సినిమా చేసి డిజాస్టర్ మూట గట్టుకున్నాడు మహేష్ 

రిపీట్ కాంబినేషన్ చేయడంలో మహేష్ అందరికంటే ముందుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. మహర్షి సినిమా ఇచ్చాడని వంశీ పైడిపల్లితో ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడు ఈయన. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా మొదలు కాబోతుంది. మహేష్ 27వ సినిమాను ఈయనతోనే చేయబోతున్నాడు. జూన్ నుంచి సినిమా పట్టాలెక్కబోతుంది. మూడు నెలల పాటు హాలీడేస్ ఎంజాయ్ చేయనున్నాడు సూపర్ స్టార్. 

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో మరోసారి పని చేయబోతున్నాడు మహేష్ బాబు. తనకు అనిల్ తో పని చేయాలని ఉందని ఇప్పటికే చెప్పేసాడు ఈయన. సూపర్ స్టార్ అడిగితే కాదనే దర్శకుడు ఉంటాడా అందుకే అనిల్ రావిపూడి కూడా ఎఫ్3 తర్వాత మరోసారి మహేష్ బాబుకు సరిపోయే కథ సిద్ధం చేయాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా రిపీట్ కాంబినేషన్స్ చేస్తూ వరసగా సినిమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్. అప్పుడప్పుడూ ఇతర దర్శకుల వైపు కూడా చూస్తే బాగుంటుందేమో మరి..? 

More Related Stories