English   

ఆర్మీ అంటే ఎంత కామెడీనో మన టాలీవుడ్ కి 

Tollywood
2020-01-21 10:15:25

సినిమా అనేది నిజం కాదు అనేది అందరికీ తెలుసు..కానీ ఈమధ్య తెలుగులో వచ్చిన రెండు సినిమాలు చూస్తే ఎందుకో ఇది రాయాలనిపిచింది. అంటే తెలుగు సినిమాని తక్కువ చేసే ఉద్దేశం లేదు కానీ ఈ చండాలం ప్యాన్ ఇండియా సినిమా పేరిట వేరే బాషల వాళ్ళు చూసి వాళ్ళు వెక్కిరించేకన్నా ఇలాంటి ఒక లాజిక్ ఆయా దర్శకుల దగ్గరకి చేరి కొంచెం అయినా ఆలోచిస్తారనే ఆశ. 

తాజాగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ కాబట్టి అక్కడ ఏదో ఒక యుద్ధం సీన్ ఉండాలి కాబట్టి హీరో ఎంట్రీ మొదలు అక్కడి నుండే కానిచ్చి ఏదో చేయాలనుకుని ఇంకేదో చేశాడు. మహేష్ మేజర్ అయినా ఓ యాభైయేళ్ల వ్యక్తిని ఆర్మీకి తీసుకువెళ్లి ఆర్మీ లో చేర్పించి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే వాడు మహాత్మునిగా మారిపోతాడా ? అదీ కాక ఇండియన్ ఆర్మీ ఒక అవినీతి పరున్ని మంచి మనిషిగా మార్చటం కోసం జాయిన్ చేసుకుంటుందా ? ఆ ఆర్మీ లో ఉన్నోడే తప్పు చేస్తే అప్పుడు వాడికి ఏ ట్రైనింగ్ ఇస్తారు ? మణిపూర్ లో కొన్ని వేల మంది అమ్మాయిలని ఇండియన్ ఆర్మీ సైనికులు రేప్ చేశారనే ఆరోపణలు మనం వింటూనే ఉండేవారం. ఈరోం షర్మిల అనే మనిషి కొన్ని ఏళ్ల సుదీర్ఘ పోరాటం కూడా చేసింది. ఈ విషయల్లు ఆ దర్శకుడుకి తెలుసో లేదో ? 

ఇక పొలిటీషియన్స్ కానీ.. అవినీతి పరులు కానీ మారాలంటే ఆర్మీయే ఆఖరి అస్త్రం అని చెప్పిన అనిల్ కి ఆర్మీలో కూడా ఎంతోమంది అవినీతి పరులున్నారు. హనీ ట్రాప్ పేరుతో దొరికిపోయి ఇక డబ్బు అయినా సంపాదించుకుందాం అని విదేశాలకు సీక్రెట్స్ అమ్మినవాళ్లున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఆర్మీ అంటే జై జవాన్ అని మాత్రమే చూపించడం ఏమిటో ఆయనకే తెలియాలి. ఆర్మీ అనగానే ఒక దేశభక్తుడు, సరిహద్దుల్లో  టెంట్లు వేసుకుని, తుపాకీ చేతిలో పట్టుకుని కాపలా కాస్తూ ఉంటాడు… అదీ కాశ్మీర్‌లో, అదీ పాకిస్థాన్ సరిహద్దుల్లో మాత్రమే… ఆ మంచు కొండల్లో మాత్రమే…అనేట్టు ఉంది మనవాళ్ళ  పరిస్థితి. 

ఇది కాక మరో సినిమా ఉంది అదే వెంకీ మామ. హీరో ఊరికి దూరం పోవాల్సిన అవసరం వస్తుంది… జస్ట్, అలా వెళ్లగానే ఆర్మీ చేర్చేసుకోవడమే కాక. మూడేళ్ళలోపే ఆయన కెప్టెన్ అవడం, ఏకంగా పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేసే రేంజ్ కి పోతాడు మన జీరో సారీ హీరో. ఓ ఆపరేషన్ లో పాక్ చేత చిక్కితే మరో హీరో వెళ్లి అక్కడున్న వెళ్లి విడిపించేయడం. అదీ కాక మిలటరీ అనగానే కాశ్మీర్ వెల్లిపొయి అక్కడున్న రెజిమెంట్స్ లో వేదికేయడం. అది కూడా కనీసం ఫోటో కూడా లేకుండా. ఏమిటో తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్తున్నాం అనుకుంటారు కానీ నవ్వుకునేలా చేస్తున్నారని.

More Related Stories