English   

మహేష్ బాబు తర్వాతి సినిమా సంగీత దర్శకుడు ఎవరంటే.. 

Mahesh Babu
2020-01-21 11:14:02

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్. హ్యాట్రిక్ పూర్తి చేసాడు కూడా. భరత్ అనే నేను సినిమాతో మొదలైన జర్నీ.. మహర్షి, ఇప్పుడు సరిలేరు నీకెవ్వరుతో పూర్తయింది. గత పదేళ్లలో మహేష్ బాబుకు రెండో హ్యాట్రిక్ ఇది. దూకుడు, సీతమ్మ వాకిట్లో, బిజినెస్ మ్యాన్ సినిమాలతో మూడు విజయాలు పూర్తి చేసిన ఈయన.. ఇప్పుడు మరోసారి ఇదే ఫీట్ చేైసి చూపించాడు. 

స్టార్ హీరోలలో హ్యాట్రిక్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు.. కానీ మహేష్ మాత్రం దూసుకుపోతున్నాడు. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో ఈయన సినిమా చేయబోతున్నాడు. దీనికి తమన్ సంగీతం అందించబోతున్నాడని తెలుస్తుంది. గతంలో మహేష్ నటించిన దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలకు కలిసి పని చేసారు. తర్వాత ఎప్పుడూ కుదర్లేదు.. దేవీకి బాగా ట్యూన్ అయ్యాడు మహేష్. 

అయితే ఇప్పుడు అల వైకుంఠపురములో తర్వాత తనను పక్కన పెట్టలేని స్థాయికి చేరిపోయాడు సంగీత దర్శకుడు తమన్‌. దాంతో ఇప్పుడు తన సినిమాకు ఈయన్నే తీసుకోవాలని చూస్తున్నాడు సూపర్ స్టార్. 'మహర్షి' తర్వాత వంశీతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. జూన్ నుంచి ఈ చిత్రం పట్టాలెక్కనుంది. 2020 చివరికల్లా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చూస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. 

More Related Stories