English   

మహేష్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయిన తమన్

thaman
2020-01-21 11:45:50

సంగీత దర్శకుడు తమన్ కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. దీంతో యూనిట్ సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ వైజాగ్ లో సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 

వైభవంగా జరిగిన ఈ వేడుకలో అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజా హెగ్డే.. నిర్మాతలు రాధాకృష్ణ, అల్లు అరవింద్, సంగీత దర్శకుడు తమన్ అలాగే సినిమా యూనిట్ హాజరయ్యారు.  ఈ వేదిక మీద ఈ సినిమాలో భాగమైనవారంతా తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమన్ ఎపుడూ లేని విధంగా ఫుల్ జోష్ లో వేదికపై ప్రశ్నగించాడు. తమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి తెరతీశాయి. 

నిజానికి  'అల వైకుంఠపురములో' 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల మధ్య మహేష్ బన్నీల ఇగో వార్ నడుస్తోంది. అదీ కాక తమన్ మాట్లాడుతూ 'నిజమైన మాటలే మాట్లాడుకుందాం నిజమైన కలెక్షన్లే చెప్పుకుందాం' అని అన్నాడు. అనుకోకుండా థమన్ నోటి వెంట వచ్చిన ఈ మాటలకు అల్లు అరవింద్ త్రివిక్రమ్ బన్నీలు నవ్వడం పై కెమెరాల దృష్టి పడింది. దీంతో ఇప్పుడు మహేష్ అభిమానులు తమన్ ను టార్గెట్ చేస్తూ షోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.  

More Related Stories