English   

వెంకీ అసురన్.. తెలుగు టైటిల్ ఇదేనా..

Venkatesh
2020-01-21 14:47:39

విక్టరీ వెంకటేష్ గురు, ఎఫ్2, వెంకిమామ వంటి చిత్రాలతో వరుసగా సక్సెస్ అందుకుంటు ఫుల్ ఫామ్ లో వున్నాడు. ఇదే జోష్ లో అప్ కమింగ్ ఫిల్మ్ తమిళ హిట్ మూవీ.. అసురన్ రీమేక్ లో నటిస్తున్నాడు వెంకీ. ఇందులో వెంకటేష్ కు జోడిగా ప్రియమణి నటిస్తోంది. గతేడాది కోలీవుడ్ లో ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' మూవీ బ్టాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకుంది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.

ఇక దర్శకుడిగా ఇప్పటి వరకు క్లాస్ సినిమాలనే తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల.. మొదటి సారిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తుండడం విశేషం. దాంతో ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి ఒక టైటిల్ తెరపైకి వచ్చింది. అందులోభాగంగా.. 'నారప్ప' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్టు చర్చ మొదలైంది. కథకు తగ్గట్టే ఈ టైటిల్ అనుకుంటున్నారని టాక్. అయితే ఈ టైటిల్ నిజమో కాదో.. క్లారిటీ వస్తే గాని తెలియదు. 

అనంతపురం రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్. తాను తో కలిసి సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో దుమ్ములేపిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించాడు వెంకటేష్. అందుకే కెరీర్ డౌన్ లో ఉన్న శ్రీకాంత్ అడ్డాలకు ఈ ఛాన్స్ దక్కిందని అంటున్నారు. మరి ఈ క్లాస్ డరెక్టర్ తొలిసారి తెరకెక్కిస్తున్న మాస్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

More Related Stories