English   

అనిల్ రావిపూడి తర్వాతి సినిమాలు ఇవే..

anil
2020-01-21 19:29:26

రాజమౌళి, కొరటాల శివ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అపజయం అంటూ లేకుండా ముందుకు దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు ఆయన చేసిన ఐదు సినిమాలు విజయం సాధించాయి. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా తనకు సరిలేరు అని నిరూపించుకున్నాడు ఈ కుర్ర దర్శకుడు. ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈయన ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానంగా అనిల్ రావిపూడి రెండు సినిమాలకు కమిట్ అయ్యాడని తెలుస్తోంది. అందులో ఒకటి మహేష్ బాబుతో ఉండబోతుంది. తనతో పనిచేసిన దర్శకులను రిపీట్ చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు.

అందులో ఒకసారి విజయం ఇచ్చారంటే కళ్ళు మూసుకొని మరో సినిమా అవకాశం ఇచ్చేస్తాడు సూపర్ స్టార్. అనిల్ రావిపూడి కూడా ఇదే చేయబోతున్నాడు మహేష్ బాబు. అయితే మహేష్ సినిమా కంటే ముందు మరో సినిమా చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. 2019 సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్2 సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు ఈయన. ఎఫ్3 టైటిల్ తో రాబోయే ఈ సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ తమ తమ పాత్రల్లో కనిపించబోతున్నారు. వీళ్లకు తోడు రవితేజ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ముందు సినిమా కంటే కూడా సీక్వెల్ లో మరింత కామెడీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా జూన్ నుంచి మొదలు కానుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో మరోసారి వర్క్ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. ఇది కూడా పక్కా మాస్ సబ్జెక్టుతో తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో దర్శకుడిగా టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు అనిల్. ఇదే సత్తా చూపిస్తా మరింత పైకి ఎదగాలని భావిస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి ఈయన జైత్రయాత్ర ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో చూడాలి.

More Related Stories