English   

ఆ విషయంలో రాజమౌళిని క్రాస్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్..

srinivas
2020-01-21 19:58:17

తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు.. ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఈజీ. మరో అనుమానం లేకుండా రాజమౌళి అని చెబుతారు ఎవరైనా. అయితే అన్ని విషయాల్లో రాజమౌళి ముందున్నా ఒక్క విషయంలో మాత్రం ఆయన కంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి వదిలి పెట్టిన రికార్డు ఒక్కటి కూడా లేదు. అది ఇది అని తేడాలేకుండా అన్నింటిని తన పేర రాసుకున్నాడు దర్శకధీరుడు. బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఒక్క విషయంలో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే వెనకాల ఉన్నాడు జక్కన్న. అదే ఓవర్సీస్ మార్కెట్ విషయంలో.. బాహుబలి సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులన్నీ తిరగరాసిన రాజమౌళి దానికి ముందు మాత్రం ఓవర్సీస్లో పెద్దగా సత్తా చూపించలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు మాత్రం అక్కడ చాలా సంవత్సరాలుగా సత్తా చూపిస్తున్నాయి. ఇప్పుడు విడుదలైన అల వైకుంఠపురంలో సినిమా కూడా బాహుబలి తర్వాత స్థానంలో నిలవడానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాతో మూడోసారి 2 మిలియన్ క్లబ్బులో చేరిపోయాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు దర్శకుల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ ఇది. రాజమౌళి కూడా బాహుబలి సినిమాలో రెండు సార్లు ఈ ఫీట్ అందుకున్నాడు కానీ త్రివిక్రమ్ మాత్రం అజ్ఞాతవాసి, అ.. ఆ.., అల వైకుంఠపురంలో సినిమాతో మూడుసార్లు ఈ రికార్డులు అందుకున్నాడు. ఖచ్చితంగా రాజమౌళి ఈ రికార్డును క్రాస్ చేస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ప్రస్తుతానికి త్రివిక్రమ్ మాత్రమే ఈ రికార్డు సాధించాడు.

More Related Stories