English   

అమలాపాల్ ఇంట తీవ్ర విషాదం

Amala Paul
2020-01-22 10:37:47

తెలుగులో చాలా మంచి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలా పాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కేరళకు చెందిన ఆమె తండ్రి పాల్ వర్గీస్ నిన్న రాత్రి కన్నుమూశారు. 61 ఏళ్ల వయసున్న ఆయన గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆరోగ్యం బాలేక పోవడంతో ఆయన కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నారు, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్ను మూశారు. విషయం తెలుసుకున్న అమలాపాల్ వెంటనే కొచ్చి బయలుదేరి వెళ్ళారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం కురుప్పంపాడు చర్చిలో జరగనున్నాయి. ఈ మేరకు అధికారిక సమాచారం కేరళ మీడియా ప్రతినిధులకి అందించారు ఆమె కుటుంబ సభ్యులు.

 "We regret to inform the demise of Mr. Paul Varghese, Father of Actress Amala Paul. Funeral Date 22.1.20 Cremation Time 3pm to 5pm Address St. Peter & St. Paul Catholic Church, Kuruppampadi."

ఈ విషయం తెలియగానే తాను నటిస్తున్న తమిళ సినిమా ట్రైలర్ లాంచ్ లో ఉన్న అమలా పాల్ వెంటనే  బయలుదేరి వెళ్లారు. అమల నటించిన 'అదోఅంద పారావాయ్ పోలా' అనే సినిమా ట్రైలర్ లాంచ్ కోసం అమలా పాల్ రెండు రోజుల పాటు చెన్నైలో ఉన్నారు. పాల్ వర్గీస్ భార్య ఆన్నిస్ పాల్, పిల్లలు అమల, అభిజిత్ లు కొచ్చి చేరుకున్నారు. 

More Related Stories