English   

మెగా ఫ్యాన్స్ మధ్య వర్మ చిచ్చు...ట్వీట్ డిలీట్ చేసేసి

RGV
2020-01-22 12:32:22

వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగ్గించాడు. ఏంట్రా బాబు తగ్గించాడు అనుకునేలోపే ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు వర్మ. మెగా కుటుంబంలో అల్లు అర్జున్ నిజమైన పవర్ స్టార్ అంటూ రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రచ్చ రేపుతోంది. 

అల్లు అర్జున్.. అల్లు రామలింగయ్యకు నిజమైన వారుసుడు అతనే వారసుడని నిరూపించుకున్నాడని తన ట్విట్టర్‌లో అభిప్రాయ పడ్డాడు వర్మ. ఓ సూపర్ స్టార్‌గా, మెగా ఫ్యాన్స్‌ను మెప్పించే హీరోగా నిలిచింది అల్లు అర్జున్ మాత్రమే అన్నారు. తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. 

ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేయడంతో రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేసి ఉండచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడు వర్మ చేసిన ట్వీట్స్ కనిపించకపోవడం సంచలనంగా మారింది. అయితే అల్లు అర్జున్ నిజమైన స్టార్ అని ఆర్జీవీ చెప్పడంతో సోషల్ మీడియాలో రచ్చ రేపింది. మెగా ఫ్యాన్స్ ఆర్జీవీపై ట్రోల్స్ చేస్తున్నారు.  

More Related Stories