English   

త్రిష పెళ్లి అక్కడేనట..కానీ 

Trisha krishnan
2020-01-22 12:55:36

చెన్నై చందమామ త్రిష టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఆమె తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయింది. అక్కడే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది.  ఒక దశ లో తన కెరీర్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోబోతుంది అనుకున్నారు.  

వరుణ్ అనే బిజినెస్‌మ్యాన్‌‌తో త్రిష కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు వైపుల పెద్దలను ఒప్పించి చెన్నైలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నట్లు త్రిష ప్రకటించారు. అయితే ఆ తర్వాత సినీ నటుడు రానాతో కొంతకాలం పాటు త్రిష ప్రేమాయణం కొనసాగించారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ సంగతులన్నీ పక్కన పెడితే తాజాగా త్రిష పెళ్లి గురించి ఒక తీపి కబురు అందించింది. 

నిన్న త్రిష ఫ్యాన్స్‌తో కాసేపు ఇన్‌స్టా్గ్రామ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో తన ఫాన్స్ తో మాట్లాడిన త్రిష ఒక ఫ్యాన్ అడిగిన ప్రశ్న కి సమాధానం ఇస్తూ నేను పెళ్లి చేసుకుంటే లాస్ వేగాస్ లో నే చేసుకుంటానని చెప్పింది.  అయితే అది ఎప్పుడు అనేది మాత్రం త్రిష చెప్పలేదు. ప్రస్తుతం త్రిష చేతి నిండా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒక మలయాళం సినిమా ఎనిమిది తమిళ సినిమాలు ఒక తెలుగు సినిమా ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో త్రిష నటించనుంది.

More Related Stories