English   

పాపం అనుష్క.. నిశ్శబ్ధం సినిమాకు సైలెంట్ కష్టాలు..

Anushka
2020-01-22 16:21:02

ఒకప్పుడు అనుష్క సినిమా అంటే ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే విజయశాంతి తర్వాత తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మళ్ళీ ఊపిరి పోసింది జేజమ్మ. అరుంధతి తర్వాత వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసింది అనుష్క. ఆమెతో సినిమాలు చేయడానికి దర్శకులు కూడా ఆసక్తి చూపించారు. అయితే ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. 

బాహుబలి సినిమా తర్వాత అనుష్క పూర్తిగా తెరపై కనిపించడం మానేసింది. భాగమతి విడుదల తర్వాత ఇప్పటివరకు అనుష్క నుంచి మరో సినిమా రాలేదు. ఈ సినిమా వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. ప్రస్తుతం నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి ఆగిపోయిందని.. కొన్ని రోజులు వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రమోషన్ కూడా ఏమీ చేయడం లేదు. 

సినిమాలో అనుష్క ఉంది అనే మాటే గాని బయట క్రేజ్ కూడా లేదు. ఒకప్పుడు అనుష్క సినిమాలకు ఉండే ఇమేజ్ ఇప్పుడు నిశ్శబ్దం సినిమాపై అస్సలు కనిపించడం లేదు. దాంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. విడుదలకు ముందు కచ్చితంగా ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకుంటారు అని వాళ్లు నమ్ముతున్నారు. హేమంత్ మధుకర్ దీనికి దర్శకుడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు. మరి చూడాలి ఈ సినిమాతో అనుష్క ఏం చేస్తుందో.

More Related Stories