English   

ట్రైలర్ లేకుండా ఏంటిది రవితేజ గారూ..

Ravi Teja
2020-01-22 17:35:14

పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి అంటే ముందుగా ట్రైలర్ విడుదల చేస్తారు. అది నచ్చితే సినిమాపై ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి. ట్రైలర్ లేకుండా సినిమా విడుదల చేయడం అనేది నిజంగా సాహసమే. ఇప్పుడు రవితేజ ఇదే చేస్తున్నాడు. ఈయన నటించిన డిస్కో రాజా జనవరి 24న విడుదల కానుంది. 

ఇప్పటికే సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇలాంటి సమయంలో రవితేజ వస్తున్నాడు. విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సైంటిఫిక్ ఎంటర్టైనర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి తోడు టీజర్ ఆకట్టుకుంది. ఇవన్నీ ఇలా ఉంటే డిస్కో రాజా ట్రైలర్ ఇంతవరకు విడుదల చేయలేదు. ట్రైలర్ లేకుండానే సినిమాను విడుదల చేస్తున్నారు. 

సంక్రాంతి సినిమాలు ఇప్పటికే మధ్యతరగతి ప్రేక్షకుల జేబులకు గండి పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ డిస్కో రాజా అంటూ రవితేజ వస్తున్నాడు. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ అనే టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు జేబులో నుంచి డబ్బులు బయటకు తీయరు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అల వైకుంఠపురంలో సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయారు.

 ఇలాంటి సమయంలో రవితేజ సినిమా వచ్చినా కూడా అల్లు అర్జున్ ధాటిని తట్టుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ట్రైలర్ లేకుండా సినిమా విడుదల చేయడం ఈ మధ్య కాలంలో తెలుగులో జరగలేదు. మరి రవితేజ డిస్కో రాజాతో ఏం చేస్తాడో చూడాలి.

More Related Stories