English   

వారం ముందే థియేటర్లోకి జాను

jaanu
2020-01-22 20:31:24

సమంత అక్కినేని, శర్వాననంద్ హిరో హీరోయిన్లుగా దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న 'జాను' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో త్రిష‌, విజ‌య్ సేతుపతి కీల‌క పాత్రల్లో న‌టించిన '96' సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. ఫీల్ గుడ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం.. కోలీవుడ్ లో అనూహ్య విజ‌యాన్ని సాధించి.. బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఇందులో నటించిన త్రిష పలు అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం.

ఒరిజినల్ వెర్షన్ '96' ని తెర‌కెక్కించిన దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ నే.. ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన జాను.. టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ముందుగా 'జాను'ను ప్రేమికుల రోజు సందర్భంగా.. ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనున్నారు. కానీ తాజాగా.. ఈ సినిమాను వారం రోజులు ముందుగానే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే ఫిబ్రవరి 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అందుకు కారణం లేకపోలేదు. ఫిబ్రవరి 14న విజయ్‌ దేవరకొండ, క్రాంతి మాధవ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' రిలీజ్‌ అవుతోంది. దాంతో 'జాను'ను వారం ముందే ప్రేక్షకుల ముందుకు తీసురానున్నారు. అయితే ఈ రిలీజ్‌ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీకి.. తమళ మాతృక '96' కి సంగీతాన్నిందించిన గోవింద వసంతనే మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఇక్కడ 'జాను' ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

More Related Stories