English   

హరీష్ శంకర్.. నెక్స్ట్ హీరో ఇతనేనా..

harish
2020-01-23 07:32:47

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కించి.. తన సత్తా ఏంటో చాటాడు యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమా హరీష్ కెరిర్లో ఓ మైలు రాయిగా నిలిచింది. ఆ తర్వాత చేసిన కొన్ని చిత్రాలు సో.. సోగానే ఉన్నా.. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో రూపొందించిన.. గద్దల కొండ గణేష్ తో మంచి హిట్ అందుకున్నాడు. అయినా.. ఇప్పటి వరకు హరీష్ తదుపరి చిత్రం అనౌన్స్ కాకపోవడం విశేషం.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. హరీష్ ప్రస్తుతం కథలు పట్టుకుని హీరోల చుట్టూ తిరుగుతున్నాడని వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరూ వాళ్ల వాళ్ల సినిమాలతో బిజీగా ఉండడం వల్లే హరీష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎటూ తేలడం లేదట. దాంతో తన సినిమాలో హీరో ఎవరు..? ఎవరు..? అనుకుంటున్న తరుణంలో.. హరీష్ కన్ను ఇప్పుడు అక్కినేని అఖిల్ పై పడిందట. ఇప్పటి వరకు సరైన హిట్ అందుకోలేకపోయిన అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎవరికి కమిట్ కాలేదు ఈ యంగ్ హీరో. దాంతో హరీష్.. అఖిల్ ను ఒప్పించే పనిలో పడ్డారని ఫిలింనగర్ ఇంటర్నల్ టాక్. అయితే.. ఇదంతా వట్టి పుకారేనని.. ఇలాంటి గాసిప్స్ కామన్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఏదేమైన హరీష్ శంకర్ నెక్ట్స్ హీరో ఎవరో ఇప్పుడే చెప్పలేమంటున్నారు.

 

More Related Stories