English   

రష్మిక ఏకంగా అంత సంపాదించేసిందా

Rashmika Mandanna
2020-01-23 11:09:04

తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తోన్న రష్మిక మందనకు ఐటీ అధికారులు ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సొంతూరులోని ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. అయితే రష్మిక సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్‌ సాండల్‌వుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ముందుగా ఆ రైడ్స్‌ రష్మిక మీదే అంటూ వార్తలు వినిపించినా తరువాత అవి వారి కుటుంబ వ్యాపారాల లావాదేవిలకు సంబంధించి జరిగినవని కొట్టి పారేశారు. అయితే ఈ విషయంలో రష్మిక మేనేజర్ సహా పీఆర్ టీం ఎన్ని రకాలుగా క్లారిటీ ఇచ్చిన రకరకాల వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

తాజాగా కన్నడ మీడియాలో ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. ఈ రైడ్స్‌ సందర్భంగా రష్మిక పేరు మీద భారీ స్థాయిలో ఆస్తులు ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారని రష్మిక పేరు మీద దాదాపు 250 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్టుగా వారు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. రష్మిక వయసు 23 ఏళ్ళు కాగా ఆమె చేసిన సినిమాలు గట్టిగా అరడజను కూడా లేవు. మరో ఆమె సినిమాలతోనే 250 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టిందనేది తేలాల్సిన అంశం.  
 

More Related Stories