English   

తెలుగు, తమిళ ప్రేక్షకుల మద్య చిచ్చు పెట్టిన అడ్డాల

Naarappa
2020-01-23 11:27:08

తెలుగు, తమిళ సినీ నెటిజన్ల మధ్య వెంకీ మామ చిచ్చు పెట్టాడు. అదేంటి ఆయన చిచ్చు పెట్టడం ఏమిటి అనుకుంటున్నారా ? తాజాగా వెంకటేష్ తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’ సినిమాను తెలుగులో‘నారప్ప’ టైటిల్‌తో  రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్న షూట్ మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ విడుదల చేశారు. 

అచ్చం తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన అసురన్‌ కి జిరాక్స్ కాపీలా ఉంది. దీంతో ఈ లుక్‌పై సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకులు రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. తలపాగా సహా ఉన్నది ఉన్నట్టు దింపేశారని తమిళ ప్రేక్షకులు హేళన చేస్తున్నారు. అయితే తమిళ నటులను మ్యాచ్ చేసే వారెవరులేరని #UnrivalledTamilActors అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ను తమిళ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. 

ఇది దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో ట్రెండ్ అవుతోంది. మనవాళ్లు అక్కడి సినిమాలను రీమేక్ చేసిన విషయాలను గుర్తు చేస్తూ విజయ్-పవన్ కళ్యాణ్ లుక్స్, అజిత్-ప్రభాస్ గెటప్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. తెలుగు హీరోలను కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ధీటుగా మన ప్రేక్షకులు కూడా ఎన్నో ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. అక్కడి హీరోల విగ్గులు, మన హీరోల స్టైలింగ్స్‌ను పోల్చుతూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ మేరకు #TeluguRealHeroes అనే హ్యాష్ ట్యాగ్‌ను మన వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఎక్కడిదాకా వెళ్తుంది అనేది చూడాలి.

More Related Stories