English   

పిట్ట కొంచెం కూత ఘనం...సుకుమార్ కూతురు పాట విన్నారా 

  Sukumar
2020-01-23 11:43:38

పిట్ట కొంచెం కూత ఘనం అనే మాట మనం కొందరికి మాత్రమే వాడగలం. అలా వాడగాలిగిన కొద్ది మందిలో ఒకరి జాబితాలో సుకుమార్ కూతురు సుకృతి చేరింది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు వేడుకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ పాట పాడి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

అయితే నిన్న సుకృతి పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ట్విట్టర్ వేదికగా సుకృతి పాడిన పాట వీడియో పోస్ట్ చేశారు. 'డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటని.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను' అని దేవిశ్రీ తన సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేశారు.

ఆ పాప సుకృతి పాట విన్న నెటిజన్లు ఆమె టాలెంట్ ని గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వాయిస్ అధ్బుతంగా ఉందని పొగుడుతున్నారు. 

More Related Stories