English   

రామ్ చరణ్, మహేష్ బాటలోనే నడుస్తున్న రవితేజ.. 

Ravi Teja
2020-01-23 15:04:15

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలు నిర్మాతలు అంటూ సపరేట్ గా లేరు. హీరోలే నిర్మాతలు అంతే.. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోలు నిర్మాతల అవతారం ఎత్తారు. ఇప్పుడు రవితేజ కూడా ఇదే కోవలో వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా బిజీ అయ్యాడు. 

ఈయన జిఎంబి ప్రొడక్షన్స్ మొదలుపెట్టి అందులో సినిమాలు నిర్మిస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు కూడా ఇలా వచ్చిందే. పారితోషికం బదులుగా ఆయన నిర్మాణంలో భాగం అవుతున్నాడు. అడవి శేష్ హీరోగా మేజర్ సినిమాను కూడా నిర్మిస్తున్నాడు మహేష్ బాబు. ఈ నిర్మాణ బాధ్యతలన్నీ నమ్రత చూసుకుంటుంది. 

ఇక రామ్ చరణ్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈయన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్థాపించి వరసగా చిరంజీవి సినిమాలు నిర్మిస్తున్నాడు. చిరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు బయటి వాళ్లకు సినిమా చేయలేదు. ఇప్పుడు నటిస్తున్న కొరటాల శివ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుంది. అయితే మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. 

ఇక నేచురల్ స్టార్ నాని ఆ సినిమాతో నిర్మాతగా మారాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలని చూస్తున్నాడు ఈయన. ఇప్పుడు హిట్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. నాని తన నిర్మాణ సంస్థకు వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ అని పేరు కూడా పెట్టాడు. నాగార్జున, బాలయ్య, ప్రభాస్ లాంటి హీరోలు కూడా నిర్మాతలుగా బిజీగానే ఉన్నారు. 

నాగశౌర్య కూడా తన సొంత బ్యానర్ లోనే ఛలో లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు అశ్వద్ధామ అంటూ వస్తున్నాడు. మనోజ్ లాంటి వాళ్లు కూడా సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ అయితే కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలోనే ఉన్నాడు. మీడియం రేంజ్  హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. పారితోషికం బదులుగా నిర్మాణంలో షేర్ అడుగుతున్నారు. 

ఇప్పుడు రవితేజ కూడా ఇదే చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈయన కూడా సినిమా అగ్రిమెంట్ కు ముందు పైసా తీసుకోకుండా తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి స్లీపింగ్ పార్టనర్ కావాలని చూస్తున్నాడు. దీనివల్ల నిర్మాతలకు కూడా లాభమే. అలాగే సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి అందులో చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించాలనే ఆలోచన కూడా చేస్తున్నాడు మాస్ రాజా. 

కొత్త స్క్రిప్టులు వస్తే కచ్చితంగా వాళ్లను ఎంకరేజ్ చేయడానికి తనకేం అభ్యంతరం లేదని చెబుతున్నాడు రవితేజ. మొత్తానికి హీరోలే నిర్మాతలు అవుతుంటే కొత్త కథలు రావడానికి ఆస్కారం దొరుకుతుంది. 

More Related Stories