English   

అశ్వథ్థామ ట్రైలర్ టాక్.. రాక్షసుడులా ఉందేంటబ్బా..

Aswathama Trailer
2020-01-23 17:19:12

నాగశౌర్య హీరోగా రమణ తేజ తెరకెక్కిస్తున్న సినిమా అశ్వథ్థామ. ఈ సినిమాకు కథ అందించింది కూడా నాగశౌర్యే. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మరోసారి సొంత బ్యానర్ లో చేస్తున్నాడు శౌర్య. మధ్యలో నర్తనశాల చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడు పూర్తిగా ఇమేజ్ మేకోవర్ కోసం అశ్వథ్థామ సినిమా చేస్తున్నాడు శౌర్య. 

మాస్ ఓరియెంటెడ్ గా ఉన్న ఈ చిత్ర ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది. అయితే రాక్షసుడు సినిమాను గుర్తు చేసే విధంగా ఉన్న కథే కాస్త కంగారు పెడుతున్న అంశం. తమిళనాట సంచలన విజయం సాధించిన రాచ్చసన్ సినిమాను గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడుగా రీమేక్ చేసాడు. ఇప్పుడు నాగశౌర్య నటిస్తున్న అశ్వథ్థామ ట్రైలర్ కూడా అలాగే ఉండటం చిత్రంగా అనిపిస్తుంది. 

ఇండస్ట్రీలో ఒకే లైన్ తో కొన్ని సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అమ్మాయిలను కిడ్నాప్ చేయడం.. చంపేయడం.. ఓ రాక్షసుడు.. దాన్ని కాపాడటానికి బయల్దేరే హీరో.. అన్నీ రాక్షసుడు సినిమాను పోలి ఉన్నాయి. కానీ కథనంలో మార్పు ఉంటుందేమో చూడాలిక. ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అశ్వథ్థామ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు నాగ శౌర్య.

More Related Stories