English   

మహేష్ - పైడిపల్లి సినిమాలో హీరోయిన్ ఆమే

kaira
2020-01-23 19:19:44

సరులేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అమెరికాలో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మ‌హేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన మహర్షి ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. పక్కా మెసేజ్ తో, తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్నే అందుకుంది. కానీ దీనిపైన ఇటు మహేష్ కానీ అటు వంశీ కానీ ఎవరు స్పందించలేదు. అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ ఆ మధ్య వంశీ పైడిప‌ల్లి మహేష్ బాబుతో సినిమా చేయబోతునట్టు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నట్టు కూడా ఆయనే వెల్లడించారు. త్వరలో ఈ సినిమా పైన ఆఫీషల్ అనౌన్స్ మెంట్ రానుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోనున్నట్టు చెబుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాతోనే కియారా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా నటించిన “వినయ విధేయ రామ ” మూవీ నిరాశపరిచింది. ఆ మూవీ తరువాత కియారా అద్వానీ తెలుగు లో నటించలేదు. బాలీవుడ్ లో బిజీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమా కోసం ఆమెను తీసుకు వస్తున్నారని అంటున్నారు. 

More Related Stories