English   

రాక్షస రాజ్యంలో రానా..

rana
2020-01-24 05:05:26

బాహుబలిలో భళ్లాల దేవాగా..తన విలనిజంతో భళా అనిపించుకున్నాడు దగ్గుబాటి రానా. ఓ విధంగా చెప్పాలంటే బాహుబలిలొ రానా రాక్షస గుణం ఉన్న పాత్రనే పోషించాడు. అయితే ఇప్పుడు నిజంగానే రాక్షసుడిగా మారనున్నాడు రానా. ప్రస్తుతం 'విరాట పర్వం' సినిమా షూటింలో బిజీగా ఉన్న రానా.. మరో రెండు బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ తోనూ బిజగా ఉన్నాడు. అలాగే బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

అయితే.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. డైరెక్టర్ తేజ-రానా కాంబినేషన్లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి' మంచి హిట్ అయింది. కెరీర్ ఫ్లాప్ లో ఉన్న తేజను మళ్లీ ఫామ్ లోకి తెచ్చింది ఈ సినిమా. ఇక రానా ఈ చిత్రంలో రాజాకీయ నాయకుడిగా నటించి సూపర్ అనిపించుకున్నాడు. దాంతో ఇప్పుడు తాజాగా.. తేజ మరోసారి రానాతో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది.

ఇప్పటికే రానా కోసం ఒక విభిన్నమైన స్టోరీని సిద్ధం చేశాడట తేజ. ఈ సినిమాలో రానాను వైవిధ్యమై పాత్రలో చూపించబోతున్నాడట తేజ. అంతేకాదు ఈ మూవీకి అప్పుడే ఓ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు టాక్. దీంతో టైటిలే సినిమాకు చాలా ఆసక్తిగా ఉందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఎప్పుడు తెలుస్తాయో చూడాలి.

 

More Related Stories