కపిల్ దేవ్ కోసం నాగ్ కమల్ హాసన్

ఈ మధ్య కాలంలో బయోపిక్స్ ఎక్కువయ్యాయి. ప్రస్తుతం జయలలిత బయోపిక్స్ తమిళ్ లో తెరకేక్కుతున్నాయి. ఇక బాలీవుడ్ లో కబీర్ సింగ్ దర్శకత్వంలో రన్వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ‘‘83’’ అనే పేరుతో తెరకెక్కుతోంది. కపిల్ దేవ్ కెరీర్ 1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మధు మంతెన, సాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రన్వీర్ సతీమణి దీపిక కపిల్‌దేవ్ భార్య రోమీ పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 10, 2020న విడుదలకానున్న ఈ సినిమాను బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్ బాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు.
అయితే ఈ సినిమాని తెలుగులో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. మరో పక్కన ఇదే సినిమాని తమిళ్ లో కమల్ హాసన్ రిలీజ్ చేయనున్నారు. ధోనీ బయోపిక్ బాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కపిల్ దేవ్ సినిమా ఎలా ఆడనుందో చూడాలి.