English   

మెగా హీరో వైష్ణవ్ తేజతో నందిని రెడ్డి మూవీ 

 Vaishnav Tej
2020-01-24 16:21:34

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పని చేసిన శానా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ  ఇంకా విడుదల కాకుండానే,  వైష్ణవ్ తేజకు అప్పుడే  రెండో  సినిమా ఓకే అయిందని చెబుతున్నారు.

 గత ఏడాది స‌మంత కీల‌క పాత్ర‌లో వచ్చిన చిత్రం `ఓ బేబీ` సినిమాని తెరకెక్కించిన నందిని రెడ్డి ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. నందినీ రెడ్డి ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్  ‘లవ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ కు కమిట్ అయింది. హిందీలో లాస్ట్ స్టోరీస్, ఘోస్ట్ స్టోరీస్ లానే తెలుగులో లవ్ స్టోరీస్ ప్లాన్ చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సిరీస్ కంప్లీట్ కాగానే మెగా హీరో సినిమా కోసం రంగంలోకి దిగుతుందట.

 ‘ఉప్పెన’ ఇంకా రిలీజ్ కూడా కాకుండానే నందిని రెడ్డి సినిమాకు వైష్ణవ్ తేజను తీసుకోవడం అనేది సాహసమనే చెప్పాలి. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకా దత్ లు స్వప్న సినిమాస్ బ్యానర్ మీద నిర్మించనున్న ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. నిజానికి ఈ సినిమా నానితో చేయనున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఆ సినిమానే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కి వెళ్ళింది.

More Related Stories