English   

మరో సాహసం చేయబోతున్న మహేష్ 

Mahesh Babu
2020-01-24 16:27:51

మన తెలుగు సినిమా పరిశ్రమ వారికి సెంటిమెంట్ లు ఎక్కువ. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఎక్కువగా కాంబినేషన్స్ నమ్ముతూ ఉంటారు. ఆ కాంబినేషన్స్ తర్వాత పాత్రలు, టైటిల్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఒక సారి చేసిన పాత్ర మళ్ళీ చేయాలంటే ఆ సినిమా హిట్ అయితేనే చేస్తుంటారు. కానీ మహేష్ ఇప్పుడు మళ్ళీ సాహసం చేస్తున్నట్టు చెబుతున్నారు. 

నిజానికి మురుగదాస్ స్పైడర్ సినిమా మహేష్ కి భారీ దెబ్బ వేసినా తరువాత మూడు వరుస హిట్లుతో మళ్లీ తన స్టామినా చూపించాడు మహేష్. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ హిట్టందుకున్న మహేష్ -తదుపరి ప్రాజెక్టును వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. ఈ సినిమాలో వంశీ స్పై కథాంశంతో మహేష్ బాబును జేమ్స్‌ బాండ్‌లా చూపించేందుకు రెడీ అవుతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే కథ కూడా ఫైనల్‌ అయ్యిందని మహేష్ కూడా అమెరికా వెళ్లి ఎంజాయ్ చేస్తూనే బాడీని బిల్డ్ చేసుకునే పనిలో పడ్డాడని అంటున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. గతంలో మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్‌ అనే నేను సినిమాలో కియారా హీరోయిన్‌ గా నటించింది. ఇప్పుడు మరోసారి ఈ భామ మహేష్ సినిమాలో నటించనుంది.

More Related Stories