English   

జెనీలియా హాట్ ఫోటోస్ చూసారా.. రీ ఎంట్రీ కోసమే..

act11
2020-01-24 20:07:04

జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాలో హాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను మైమరిపించిన బ్యూటీ. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది స్టార్ హీరోయిన్ అయింది. అయితే పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరమైపోయింది జెనీలియా. ఇప్పుడు భర్త రితేష్ దేశ్ ముఖ్ తో కలిసి నటించడానికి మంచి కథ కోసం చూస్తున్నానని చెప్పింది. దాంతో పాటు తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు జెన్నీ ఉన్న తీరుకు ఇక్కడ అవకాశాలు రావడం కష్టమే. కానీ ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా తన ఫిజిక్ కాపాడుకుంటుంది. ఇప్పుడు విడుదలైన హాట్ ఫోటోషూట్ చూస్తుంటే జెనీలియాకు వయసు అయిపోయిందని ఎవరూ అనుకోరు. అవకాశాల కోసమే హాట్ ఫోటోషూట్ కూడా చేసి విడుదల చేసింది జెన్నీ బేబీ. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా తనలో ఏ మాత్రం అందం తగ్గలేదని నిరూపించుకుంటుంది జెనీలియా. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. కథ నచ్చితే తెలుగులో నటించడానికి కూడా సిద్ధమే అంటుంది జెన్నీ బేబీ. రానాతో నటించిన నా యిష్టం తర్వాత ఇక్కడ మళ్లీ సినిమాలు చేయలేదు. పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మళ్లీ వస్తానంటుంది. మరి హాసిని వస్తానంటే మాత్రం మనోళ్లు రానిస్తారా..? వస్తే అక్క వదిన పాత్రలు ఇస్తారా..? జెనీలియా రీ ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

More Related Stories