English   

రజినీకాంత్ ...రేంజ్ నిజంగానే దిగజారిపోతుందా...

Rajanikanth Menia.jpg
2020-01-24 22:10:48

తమిళనాట రజినీకాంత్ హవా తగ్గిపోతుంది. ఈ వార్తలు కొన్ని రోజుల నుంచి వస్తూనే ఉన్నాయి. కానీ నమ్మడానికి సాక్ష్యాలు సరిపోవడం లేదంటున్నారు అభిమానులు. దర్బార్ వస్తుంది.. రజినీ మళ్లీ బాక్సాఫీస్ దందా చేస్తాడని ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ చిత్రం కూడా ఊహించిన వసూళ్లు తీసుకురాలేక చేతులెత్తేసింది. ఇదే సమయంలో మెల్లగా విజయ్ స్టామినా పెంచుకుంటున్నాడు. ఇది కొన్నేళ్లుగా కనిపిస్తూనే ఉంది. వరస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు రేపుతున్నాడు ఈయన. గతేడాది ఈయన నటించిన 'బిగిల్' కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ దర్బార్ మాత్రం ఇప్పుడు 200 కోట్ల క్లబ్బులో కూడా చేరలేకపోయింది.

ఇదొక్కటే కాదు రజినీ గత సినిమాలు కూడా అంచనాలు అందుకోలేదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా రజినీకి పోటీగా వస్తున్నాడు విజయ్. ఈయన గతంలో 25 కోట్ల వరకు తీసుకున్నాడు.. కానీ ఇప్పుడు ఏకంగా మరో 25 కోట్లు పెంచేసాడు. ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న మ్యాజిక్ కూడా అలాగే ఉన్నాయి. 300 కోట్లను కూడా ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. సర్కార్ కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుని సంచలన విజయం సాధించింది. తమిళనాటే కాదు తెలుగులో కూడా విజయ్ సినిమాలు ఇప్పుడు విజయం సాధిస్తున్నాయి. మరోవైపు రజినీ మాత్రం వరస పరాజయాలతో వెనకబడిపోయాడు.

దాంతో ఇప్పుడు రజినీ రేంజ్ పడిపోయిందని అంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. ఈ చిత్రంతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొడితే తప్ప రజినీ మేనియా ఇక లేనట్లే. మరి అంత దమ్ము ఈ చిత్రంలో ఉంటుందా.. రజినీ మళ్లీ మ్యాజిక్ చేస్తాడా అనేది మాత్రం అనుమానమే. చూడాలిక.. ఏం జరగబోతుందో..? 

More Related Stories