English   

అక్కినేని అభిమానులకు షాక్ ఇస్తోన్న సమంతా

sam
2020-01-25 07:11:34

సినిమా ఇండస్ట్రీలో సమంతకు మంచి పేరు ఉంది. అక్కినేని వారింట కోడలు అయ్యాక దానిని మరింత పెంచుకునే పనిలో పడింది ఈ మలబార్ బ్యూటీ. అక్కినేని వారసుడు నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అయితే పెళ్లి అయ్యాక ఈమె కొన్ని పాత్రలకే పరిమితం కావలసి వస్తోందట. అందుకే ఈమె ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోనున్నట్టు చెబుతున్నారు. ఆమె సినిమాలు తగ్గించేసే యోచనలో ఉందని అంటున్నారు. ఎందుకంటే సినిమాలలో అన్ని రకాల పాత్రలు చేయలేక గిరి గీసుకుని కూర్చోవడం కంటే ఆ సమయాన్ని వేరే పని మీద పెడితే మంచిది అనే యోచనలో ఆమె ఉన్నట్టు చెబుతున్నారు. ఆమె ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి జాను సినిమా చేస్తున్నది. ఈ సినిమా రిలీజ్ కి దగ్గర పడింది. ఈ సినిమా తర్వాత `ఫ్యామిలీ మ్యాన్‌-సీజన్2` వెబ్ సిరీస్‌లో సమంత నటించింది. అయితే సినిమా రిలీజ అయ్యాక  మరో ప్రయోగానికి సమంత సిద్ధమవుతోందట. అదేంటంటే త్వరలోనే ఈ స్టార్ హీరోయిన్ బుల్లితెర రంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంటింటికి శామ్ తరహాలో ఓ బుల్లితెర టాక్ షోని డిజైన్ చేశారని అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ఇది ఏ చానెల్ ఏమిటి అనేది ఇంకా ఏమీ తెలియకున్నా ఆమె సినిమాలు చేయడం తగ్గించేస్తాను అని చెప్పడం మాత్రం కాస్త రచ్చ రేపే విధంగానే ఉంది. ఎందుకంటే అక్కినేని అభిమానులు తమ వారసుల సినిమాలతో పాటు ఆమె సినిమాలను కూడా ఆదరిస్తున్నారు. మరి ఇప్పుడు ఆమె సినిమాలు ఆపేయడం అంటే వారికి షాక్ ఇచ్చినట్టే పాపం.  

 

More Related Stories