English   

రాజమౌళికి ఎదురెళ్లే దమ్ము ఎవరికైనా ఉందా...

Rajamouli.jpg
2020-01-25 09:15:29

తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి రూలర్. ఆయనేం చెబితే అది జరుగుతుంది. ఈయన సినిమాల విషయంలో కూడా అంతే. ఒక్కసారి కమిటైతే అంతా సైలెంట్ గా సైడ్ ఇవ్వాల్సిందే. అందుకే తన సినిమాల విడుదల తేదీని కూడా ఏడాది ముందే ప్రకటిస్తాడు రాజమౌళి. కానీ చెప్పిన టైమ్ కు మాత్రం రాడు. ఒక్కోసారి క్వాలిటీ పేరుతో ఆలస్యం చేస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను జులై 30న విడుదల చేస్తామని చెబుతున్నాడు దర్శక ధీరుడు. కానీ వాళ్లు చెప్పినంత ఈజీ కాదు ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కావడం అంటున్నారు విశ్లేషకులు.

ముఖ్యంగా షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా భారీగానే ఉండటంతో సినిమా అనుకున్న టైమ్ కు విడుదల కానట్లే అంటున్నారు. అయితే అప్పుడు మిస్ అయితే దసరాను టార్గెట్ చేస్తున్నాడు రాజమౌళి. కానీ మొన్నామధ్య మత్తు వదలరా సినిమా ఈవెంట్ లో రాజమౌళి మాటలు విన్న తర్వాత అసలు 2020లో ఆర్ఆర్ఆర్ వస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మనసు మార్చుకుని ఈ చిత్రం 2021కి పోస్ట్ పోన్ కానీ అయిందంటే మాత్రం మరో అనుమానం లేకుండా సంక్రాంతి సీజన్‌కి తీసుకురావాలని చూస్తున్నాడు రాజమౌళి. RRR కానీ సంక్రాంతికి వచ్చిందంటే ఇతర హీరోలు కానీ.. దర్శకులు కానీ రాజమౌళికి ఎదురెళ్లే ధైర్యం చేస్తారా.. కనీసం ఆ వైపుగా ఆలోచిస్తారా..? ఎందుకంటే ఇప్పటికే అనిల్ రావిపూడి ఎఫ్2.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా సంక్రాంతి విడుదలకే ప్లాన్ చేస్తున్నారు.

మరి రాజమౌళి వస్తే వీళ్ళంతా వస్తారా.. సైలెంట్ గా సైడ్ ఇచ్చేస్తారా..? ఏమో దీనికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది.

More Related Stories