English   

డిస్కో రాజా ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ డీసెంట్ స్టార్ట్..

Disco Raja
2020-01-25 13:07:47

మాస్ రాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా డిస్కో రాజా. ఈ చిత్రానికి తొలిరోజు యావరేజ్ టాక్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. దానికితోడు థియేటర్స్ కూడా తక్కువగానే ఇవ్వడంతో ఇప్పుడు వసూళ్లు కూడా మామూలుగానే వచ్చాయి. 

గతంలో రవితేజ సినిమాకు తొలిరోజే కనీసం 4 కోట్ల నుంచి 6 కోట్ల మధ్యలో వచ్చేది షేర్. కానీ ఇప్పుడు డిస్కో రాజాకు మాత్రం 3 నుంచి 4 కోట్ల మధ్యలో మాత్రమే షేర్ వచ్చినట్లు తెలుస్తుంది. 22 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అద్భుతాలు చేయాలి. ప్రస్తుతం సంక్రాంతి సినిమాలు ఇంకా సత్తా చూపిస్తుండటంతో ఇప్పుడు డిస్కో రాజా పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి చెప్పుకోదగ్గ వసూళ్లు అయితే రాలేదు. 

తొలిరోజు మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా 4.2 కోట్ల షేర్ వచ్చినట్లు అంచనా. రెండోరోజు కూడా పర్లేదు అనేలా ఓపెనింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ షోలకు పెద్దగా లేకపోయినా కూడా మ్యాట్నీ నుంచి పుంజుకుంటాయని ఆశిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. మరి చూడాలిక.. ఈ టాక్ తో డిస్కో రాజాను రవితేజ ఎంత దూరం తీసుకెళ్తాడో..? 

More Related Stories