English   

రాజమౌళి మీద నమ్మకం..అండగా ఛానల్ ఓనర్ 

Matrix Prasad
2020-01-25 13:42:06

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి, సాహో, సైరా వంటి సినిమాల తరువాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో పాటు రాజమౌళి బ్రాండ్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరోల సరసన ఆలియా- ఒలీవియా కథనాయికలుగా నటిస్తున్నారు. డి.వి.వి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 

బడ్జెట్ 350 కోట్లు పైమాటేనని ప్రచారం సాగుతోంది. అయితే నిజానికి రాజమౌళి- రామ్ చరణ్ కూడా పెట్టుబడులు పెడుతున్నారని ప్రచారమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాణంలో ఓ బడా పారిశ్రామిక వేత్త పేరు తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ వెనుక ఓ పెద్ద వ్యాపారవేత్త ఫైనాన్షియర్ గా ఉన్నారని తెలుస్తోంది. ఆయనే నిమ్మగడ్డ ప్రసాద్. పేరుకి దానయ్య నిర్మాతగా ఉన్నా ఫైనాన్స్ అంతా ఆయనే సెట్ చేస్తున్నారట. 

రాజమౌళి మీద నమ్మకంతోనే ఆయన చాలా తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. ? ఆర్ ఆర్ ఆర్ కి అసలు నిర్మాత రాజమౌళి అంటున్నారు. ఎందుకంటే దానయ్య నిర్మాత అయినా అన్ని వ్యవహారాలు రాజమౌళినే చూసుకుంటున్నారు. అందుకే ఈ సినిమా బిజినెస్ కూడా చేయకుండా ఉంచారట. లాభాల్లో కూడా ఆయనే ఎక్కువ వాటా తీసుకునేలా ప్లాన్ చేశారట. చూడాలి మరి ఏమవుతుందో ? 

More Related Stories