English   

కత్రినా పెళ్లా... ఎప్పుడు...ఎక్కడ

Katrina Kaif
2020-01-25 14:05:34

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంది. అదేంటి కత్రినా పెళ్లా..? ఎప్పుడు ? ఎక్కడ ? ఇంతకీ ఎవరితో అదీ ఇంత సైలెంట్ గా అనుకుంటున్నారా..? అవును ఆమె పెళ్లి జరిగింది.. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా కూడా అది నిజమే. ఈ పెళ్ళికి ఇండియన్ సినిమా దిగ్గజాలు చాలా మంది హాజరయ్యారు. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. 

తెలుగు నుండి నాగార్జున, తమిళ నుండి ప్రభు, కన్నడ నుండి శివరాజకుమార్ సహా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కూడా హాజరయ్యాడు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిజంగానే పెళ్లిని తలపించిన ఈ సీను కళ్యాణ్ జ్యుయలర్సకి సంబంధించిన యాడ్. ఈ షోరూమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న కత్రినతో ఓ యాడ్ రూపొందించింది. 

అదే నగల దుకాణానికి తెలుగులో నాగార్జున, తమిళంలో ప్రభు, కన్నడలో శివరాజ్ కుమార్ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ ఆయన సతీమణి జయాబచ్చన్ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. అందరినీ కలిపి ఈయాడ్‌ని రూపొందించింది కళ్యాణ్ జ్యుయలర్స్. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

More Related Stories