English   

బాలయ్య గుండు వెనక ఉన్న అసలు కథ అదే..

nbk
2020-01-25 20:02:28

ఉన్నట్లుండి నందమూరి బాలకృష్ణ గుండుతో కనిపించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. మొన్నటికి మొన్న రూలర్ సినిమా కోసం ఏకంగా 11 కేజీలు తగ్గిపోయాడు బాలయ్య. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా కోసం అంతకంటే తగ్గాడు కూడా. ఇందులో తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు నందమూరి నటసింహం. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ఇప్పుడు గుండు కొట్టించుకున్నాడు ఈయన. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈయన నటించబోయే సినిమా ఇప్పటికే ప్రారంభమైంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. దానికి కారణం తన బరువు తగ్గించుకోవడమే. ఈ సినిమాలో ముందు నుంచి కాసేపు గుండుతోనే కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. బోయపాటి సినిమాలో ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తుంది. ముఖ్యంగా తెల్లగడ్డం.. గుండుతో బాలయ్య లుక్ అదిరిపోతుంది. సింహా, లెజెండ్ సినిమాలలో బాలయ్యను కొత్తగా చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఈ సారి కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. కథ ఎలా ఉన్నా కూడా బాలయ్య గెటప్ తోనే సినిమాను సగం హిట్ చేస్తాడు బోయపాటి. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. నిజానికి ఇప్పటికే బోయపాటి, బాలయ్య సినిమా సెట్స్‌ పైకి రావాలి. కానీ బోయపాటి తల్లి సీతారామమ్మ చనిపోవడంతో కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసాడు బాలయ్య. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రానున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు. మొత్తానికి బాలయ్య గుండుతో ఉన్నంత సేపు కూడా సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలుస్తుంది. మరి చూడాలిక.. ఈ చిత్రం ఎలా ఉండబోతుందో..?

More Related Stories