కొత్త బిజినెస్ లోకి అల్లు అరవింద్..ఆహ అంటూ ఆమెజాన్ కి షాక్

తెలుగు వారు మంచి వ్యాపారవేత్తలు అని చాలా సార్లు నిరూపించుకోగా ఇప్పుడు మరో మారు వారు ఇందులోనూ తక్కువ కాదని నిరూపించారు. తెలుగులో మంచి నిర్మాతగా అనేక విజయవంతమైన సినిమాలతో దూసుకు వెళ్తున్న అల్లు అరవింద్ మరో కొత్త బిజినెస్ లోకి దిగారు. ఆయనకు ప్రస్తుతం రెండు సొంత బ్యానర్లతో పాటు మల్టీప్లెక్స్ బిజినెస్ లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఆయన ముందే జాగ్రత్త పడ్డారు. అందుకే ఆయన డిజిటల్ ప్లాట్‌ఫాం లో కూడా తన మార్క్ వేయాడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం సినిమా రంగానికి ధీటైన పోటీగా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, జీ ఫైవ్ లాంటి డిజిటల్ మాధ్యమాల్లో పలు రకాల వెబ్‌సిరీస్‌లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో సినిమాల కంటే కూడా ఈ సిరీస్ బెటర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే చాలా మంది స్టార్స్ కూడా వాటి మీద ద్రుష్టి పెడుతున్నారు. అందుకే అరవింద్ ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి అడుగువేసేందుకు రెడీ అయ్యారు. అందుకే ప్రముఖ వ్యాపార వేత్తలు మాట్రిక్స్ ప్రసాద్(నిమ్మగడ్డ), రామేశ్వర్ రావు (టీవీ9) భాగస్వామ్యంతో సొంతంగా ఓ డిజిటల్ మీడియాను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ‘అహ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ ఫ్లాట్‌ఫాంపై ఇక నుంచి పలు రకాల వెబ్‌సిరీస్‌లు నిర్మించడమే కాక పలు తెలుగు హిట్ సినిమాలను కూడా కొననుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యచరణను రూపొందించే పనిలో ఉన్నారట అల్లు అరవింద్. ఇప్పటికే ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్‌కు పెట్టిన పేరును బట్టి చూస్తుంటే.. ఇది బన్ని పిల్లలు అయాన్, అర్హల పేర్లు మీదుగా పెట్టినట్లు చెబుతున్నారు.